jump to navigation

పుట్టెడు దుఃఖంతో……… డిసెంబర్ 13, 2008

Posted by meeturphany in Uncategorized.
add a comment

స్వప్నిక, ప్రణీతలపై యసిడ్ దాడి కి స్పందిస్తూ అల్లం నారాయణ గారు అంధ్ర జ్యొతి లో ఈ రోజు (13-12-2008)  ఒక వ్యాసం రాసారు. నేర ప్రవౄతి పెరగడానికి దారి తీస్తున్న మన సమాజం, సంస్కౄతీ పోకడల పైన ఆయన రాసిన విమర్శనాత్మక వ్యాసం యధాతథంగా.

స్వప్నిక ప్రపంచం కూలిపోయింది. రంగు రంగుల స్వప్నం లాంటి ఆమె జీవితం హటాత్తుగా మసక బారింది. కలత పడింది సమాజం. నువ్వు – నేను ప్రతి తల్లి తండ్రి కన్నీల్లు పెట్టారు. ఒకే ఒక శ్రీనివాసు గాడి బుర్రలో దూరిన విష నాగు దాడికి మొత్తం ప్రపంచం కళవెళ పడింది. నిజమే మొదట్లోనే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ఇలా జరిగేదా. ఇపుడెంత బాధ పడుతున్నాను. ఐనా నేను భయపడటం లేదు. నేను తప్పు చేయలేదు. దేవుడు నా వైపే ఉన్నాడు. నాకు న్యాయం జరుగుతుంది అంటున్నది స్వప్నిక. ఆమె దేవుడిని నమ్ముకున్నది. బహుశా పౌర సమాజం ఇవ్వాల్సిన ఏ రక్షణా ఆమెకు సరి పోలేదేమో. రక్షన వ్యవస్థ వైఫల్యం అతి పురాతన కథ. ఇక మిగిలింది దేవుడె. చివరకు దేవుడు కాపాడలేదు. అంతెందుకు కార్గిల్ యుద్దం లో శత్రు సైనికులను తరిమిన సైనికుదైన స్వప్నిక తండ్రి ఆమెను కాపాడలేక పోయాడు. అతనిప్పుడు వలపోస్తునాడు. యుద్దం లొ దొరికిన న్యాయం కూడా శాంతి సమాజం లొ ఆయనకు దొరకలెదు. కార్గిల్ లో వీర జవాన్లని కీర్తించిన వాల్లే ఆయనను ఓడించారు.

అవును.. అతి కిరాతకుడు శ్రీనివాస్ ఒక్కడే నిందితుడా! స్వప్నిక స్వప్నాలు చిదిమినవాడు, ప్రణీతా ‘ఇంఫోసిశ్ మిల్లీనీర్ కెరీర్ కలను భగ్నం చేసిన వాడు ఆ ఒక్క కిరాతకుడేనా? ఇదంతా ఎక్కడ జరిగింది. వరంగల్ లో. వరంగల్ కు ఒకప్పుడు ఒక సంస్కౄతి ఉండేది. ఒకప్పుడు అక్కడ జీవన సౌందర్యం తాలూకు సంస్కౄతి పరిఢవిల్లేది. అమ్మాయిలను గౌరవించే సంస్కౄతి సమాన ఫాయా లో గుర్తించె సంస్కౄతి, ‘ఆకాశం లో సగం’ గా కీర్తించే సంస్కౄతి ఉండేది. విష నాగుల పడగల మీద కాలేసి కోరలు పీకే భావితరం దూతలు ఒకప్పుడు వరంగల్లును శాసించినపుడు, అమ్మాయిల వంక చూడడానికే భయపడే ఒక కాలం ఉండేది. అమ్మాయిలను, స్త్రీలను గౌరవించడం ఒక సంస్కౄతి.  ఆ సంస్కౄతి ధ్వంసం అయి పోయింది. రౌడీలు, గుండాలు, లూఫేనులు గజ గజ వణికే కాలం ఇప్పుడు లేదు. ఆ సంస్కౄతి ధ్వంసం అయినాక వచ్చిందే విధ్వంసం సంస్కౄతి. బహుశా అది సర్వత్రా వ్యాపించి ఉన్నది. అందుకు కలత పడుతూనే, దుఃఖంతోనే, ఒకే ఒక ప్రశ్న. ఈ కిరాతకపు దాడికి భాద్యుడు ఒకడేనా? నిందితుడు ఒక్క శ్రీనివాసేనా? నిందితుడు ఒక మనోహరేనా? నిజమే ప్రణీత చెప్పినట్టు శ్రీనివాసును ఉరి తీయాల్సిందే. కాదు కాదు. స్వప్నిక, ప్రణీతల పై ఎంత కిరాతకంగా యాసిడ్ పోసాడొ? అంతే కిరాతంగా వాన్ని యాసిడ్ పోసి హింసించి చంపాలి. నిజమే అలాంటి వాన్ని ఒక్క సారి చంపకూడదు. వాడికి ఏ భాధా తెలియకుండా చంపకూడదు. అవును వాడిని అప్పగిస్తే ఎంకౌంటర్  చెయ్యాలి. ఉరి తియ్యాలి. ముక్కలు ముక్కలుగా నరకాలి. స్వప్నిక, ప్రనీతలు అనుభవిస్తున్న నరక సమానమైన భాధను, వేదనను వాడు అనుభవించాలి. అంతటితో ఒక్క శ్రీనివాస్ అంతమౌతాడు. తర్వాత, మనోహర్ తర్వాత శ్రీనివాస్. మధ్యలో ఐదేల్లు 24 కేసులు. అమానుషంగా, అనాగరికంగా కిరాతకంగా, మౄగ సమానంగా అమ్మాయిలను చంపేసిన వాళ్ళు, యాసిడ్ పోసిన వాళ్ళు, బండరాయితో మోదిన వాళ్ళు. ఇది ఇంతటితో ఆగుతుందా? శ్రీనివాస్ బుర్రలో ఏ దయ్యం కూచున్నది. ఆ దయ్యాన్ని చూడమంటున్నా. ఆ దయ్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది. అదీ సమస్య. ఆ దయ్యం ఎక్కడిది? ఏది ధ్వంసమై, ఈ విధ్వంసం శ్రీనివాసు గాడి బుర్రలో దూరింది. వాడొక్కడేనా, వాడొక్కడే ఐతే 24 కేసుల్లోనూ ఒక్కడే బాధ్యుడా. సినిమాల్లో హీరోలేం చేస్తారు. ప్రేమించమని వెంటపడని సినిమా ఉందా. అమ్మాయి అంటే, కాల్లేజ్ అమ్మాయి అంటే, పక్కింటి అమ్మాయి అంటే ప్రేమించే వస్తువు తప్ప మరేమీ కాదనే ఆలోచనాధార ఎక్కడిది. అమ్మాయి అంటె ప్రేమించాలి. లేదా? ప్రేమించక పొతే ప్రతీకారాం తీర్చుకోవాలి, వెంటపడాలి. వేధించాలి. ఒక్క సినిమానన్నా మినహాయించి చూపగలరా! అమ్మాయిలీ అంగాగ్న ప్రదర్శన లేని, ఒక్క టి.వి. ‘షో’ ని చూపగలరా! అమ్మాయంటే ఆట వస్తువుగా ఆస్థి గా, హక్కుభుక్తంగా భావించని ఒక్క కథనాన్ని చూపగలరా! నట్టింట నడయాడే ఈ విష నాగుల గురించి మాట్లాడగలరా! ’10 త్ క్లాస్శ్ విజయం పునాదులమీదా ఇప్పుడు ‘వేసవి సెలవుల్లో’ సినిమాకు ప్రణాళిక వేస్తున్న వారి బుర్రలో దయ్యాన్ని గురించి ఏం చెయ్యాలి! 10 త్ క్లాస్ లో ప్రేమా, లేచిపో.. హింస ఆ తరువాత వేసవి సెలవుల్లో ప్రేమ. అక్కడ ఖాళీ కూడదు. హీరొయిన్ను కిడ్నాప్ చేసిన వాడే హీరో. హేరోయిన్ ప్రేమించక పోతే శాడిజం ప్రదర్శించేవాడే హీరో. ఎక్కడ తప్పిచుకోగలం ఈ దయ్యాన్ని. నేరాలు-ఘోరాలు నటీ నటులతొ సహా, ఎలా చంపాలి ఎలా ఉరి పోయాలి చూపుతున్నప్పుడు, కళ్ళప్పగించి చూస్తున్న వాళ్ళ మెదడులో ఏ పురుగు మెసులుతుందో? ఎప్పుడైనా ఆలోచించగలమా.

నిజమే. ఇంటర్ లో ప్రేమా, క్లాస్ రూం లో కడుపు… ఎవరన్నా ఈ వి ‘చిత్రాన్నీ , అది నిర్మించిన పెద్ద మనిషినీ, తీసిన కళాకారున్ని ఎప్పుడైనా ప్రశ్నించారా? శ్రీనివాసు గాడి బుఱ్ఱలో ఎన్ని దయ్యాలు దూరాయో…. ఆ దయ్యాలకు ఒక అండ కూడా ఉంది. వాడి తండ్రి బిల్డర్. వాడికి పోలీసుల రక్షణ ఉంది. లేదా! పోలీసులకు ఒక కార్గిల్ వీరుని ఫిర్యాదు కన్నా, ఒక బిల్డర్ లావాదేవీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచే క్శీణ విలువలలో ఉండి ఉండవచ్చు.
విలువలెక్కడివి? ఒక పద్యం చదవమనో? మంచి పుస్తకం చదవమనో? శ్రీ శ్రీ మహా ప్రస్థానం చదవాలనో యువతకు ఎవరు చెప్పాలీ! చెప్పగలమా? శ్రీనివాసుగాడే కాదు….. మీ కొడుకూ…. నా కొడుకూ…. బుఱ్ఱలోకి ఎం వెల్తుందో? గమనించే ఓపికా ఈ పౌర సమాజానికి ఉందా? చదువు. టి.వి., సినిమా, వీధి, మాల్ ఊరిస్తున్నది. అంగాంగ ప్రదర్శన చేస్తున్నది. సంపాదించు, ఖర్చు పెట్టు, లెట్ అజ్ ఎంజాయ్. డబ్బుంటే అమ్మాయి కూడా ప్రేమించాలీ. పబ్బులు, బార్లు, అలంకరించిన వీధులు, బుఱ్ఱలో విష నాగులు దూరుతున్నాయి. సమాజ హితం కోసం పోటెత్తిన వీధులిపుడు రంగుల వలలు విసిరే అంగడి బజార్లను తలపిస్తున్నాయి. అదీ సమస్య.

క్షీణ విలువలు ఒక సమస్య. రాజకీయాలు ఒక సమస్య. ఆ రాజకీయాలు పట్టించుకోని ఒక అసహజ పరిణమాల సమాజం ఒక సమస్య. వ్యవస్థల వైఫల్యాలు, సంస్కౄతీ వైఫల్యాలు వెరసి శ్రీనుగాడి బుఱ్ఱలో దయ్యం దూరింది. బహుశా ఈ శ్రీనుగాడి బుఱ్ఱలో దయ్యం రేపు మరొక ‘మౄగాడీ లో దూరుతుంది. ప్రత్యమ్న్యాయాలను ఎదగనీయకుండా, ప్రోది చెయ్యకుండా, సంస్కౄతులను విఛ్ఛిన్నం చేసి వాటి స్థానం లో వికౄత సంస్కౄతులకు నీరాజనాలర్పిస్తున్న మన అల్పత్వం లో శ్రీనుగాడి వైఫల్యం ఉంది గమనించగలమా! నిజమే ‘root cause of crime is society’….. అవును మన విలువల పతనం లో రేపటి శ్రీనుగాడి బుఱ్ఱలో దయ్యం ఉంది. దాన్ని చంపేయాలి. కొంచం దుఃఖంతో…. వివశంతో… నిస్సహాయతతో…. ఆక్రోశంతో కూడా…….

Hello world! డిసెంబర్ 3, 2008

Posted by meeturphany in Uncategorized.
1 comment so far

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!